Hyderabad: నా పెళ్లి ఉంది.. జైలుకు వెళ్లనంటూ నిందితుడి హల్ చల్

Khaidi Hulchul Hungama Nampally court
  • గంజాయి కేసులో అరెస్ట్ చేసిన శాలిబండ పోలీసులు
  • 25న తన పెళ్లి ఉందంటూ కోర్టు లోపల డోర్ అద్దాలు పగులగొట్టిన వైనం
  • అప్పటికే అతనిపై 18 కేసులు
హైదరాబాద్ లో ఓ నిందితుడు జైలుకు వెళ్లనంటూ హంగామా సృష్టించాడు. ఈ నెల 25వ తేదీన తన పెళ్లి ఉందని, కాబట్టి తాను జైలుకు వెళ్లనంటూ నాంపల్లి కోర్టులో వీరంగం సృష్టించాడు. ఆనంద్ అగర్వాల్ అనే రౌడీ షీటర్ పైన 18 కేసులు ఉన్నాయి. ఇటీవల గంజాయి కేసులో శాలిబండ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఈ రోజు అతనిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించింది.

అయితే తనకు పెళ్లి కుదిరిందని, జైలుకు వెళ్లనని హల్ చల్ చేశాడు. అంతటితో ఆగలేదు. కోర్టు లోపల డోర్ అద్దాలను పగులగొట్టాడు. ఆనంద్ నెల రోజుల క్రితమే ఓ హత్య కేసులో జైలుకు వెళ్లి విడుదలయ్యాడు. అతనిపై మర్డర్, దొంగతనం, గంజాయి కేసులు ఉన్నాయి.
Hyderabad
TS High Court

More Telugu News