Rajanikanth: 'జైలర్' షూటింగ్ పూర్తి .. రిలీజ్ డేట్ అదే!

  • రజనీకాంత్ హీరోగా రూపొందిన 'జైలర్'
  • తాజాగా షూటింగు పూర్తిచేసుకున్న సినిమా
  • సంగీతాన్ని అందించిన అనిరుధ్ 
  • చాలా గ్యాప్ తరువాత రజనీతో చేస్తున్న రమ్యకృష్ణ 
  • ఆగస్టు 10వ తేదీన సినిమా విడుదల  
Jailer Movie Update

రజనీకాంత్ తాజా చిత్రంగా 'జైలర్' సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఒక జైలు చుట్టూ .. జైలర్ జీవితం చుట్టూ తిరిగే కథ ఇది. టైటిల్ పరంగా .. రజనీకాంత్ లుక్ పరంగా ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచింది. 

కొంతకాలంగా చిత్రీకరణ జరుపుకుంటూ వస్తున్న ఈ సినిమా, షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ సభ్యులతో కలిసి రజనీకాంత్ కేక్ కట్ చేశారు. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించిన తమన్నా కూడా ఈ సందడిలో పాలుపంచుకుంది. ఆ సమయంలో తీసిన ఫొటోలు ఇప్పుడు అభిమానులలో హుషారును రేకెత్తిస్తున్నాయి.

రజనీకాంత్ - రమ్యకృష్ణ కాంబినేషన్ కి గల క్రేజ్ ను గురించి తెలిసిందే. చాలా కాలం తరువాత ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో శివరాజ్ కుమార్ .. జాకీ ష్రాఫ్ కనిపించనున్నారు. అతిథి పాత్రలో మోహన్ లాల్ మెరవనున్నారు. అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా, ఆగస్టు 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News