Sharath Chandra Reddy: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారీ ట్విస్ట్.. అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి

Sharath Chandra Reddy become approver in Delhi liquor scam
  • అప్రూవర్ గా మారేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును కోరిన శరత్ చంద్రారెడ్డి
  • ఆయన అభ్యర్థనను అంగీకరించిన కోర్టు
  • ఈ కేసులో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు కీలక మలుపు తిరిగింది. కేసులో కీలక నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. అప్రూవర్ గా మారడానికి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఆయన అప్రూవర్ గా మారిన నేపథ్యంలో కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నారు. 

ఈ కేసులో పెద్దపెద్ద వ్యక్తులపై అభియోగాలు ఉన్న నేపథ్యంలో, శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడం ఆసక్తికరంగా మారింది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా చాలా రోజులుగా జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా ఛార్జ్ షీట్ లో ఉంది. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు కూడా అప్రూవర్ గా మారిన సంగతి గమనార్హం.
Sharath Chandra Reddy
Delhi Liquor Scam
Approver

More Telugu News