viral vedio: సైకిల్ ను ఇలా కూడా తొక్కుతారా..?

Adorable video of two boys riding a bicycle in a funny way will make you giggle viral vedio
  • చెరో పెడల్ పంచుకున్న ఇద్దరు బాలురు
  • ఇద్దరూ తొక్కుకుంటూ వెళుతున్న తీరు
  • 59 లక్షల మంది వీక్షించిన వైరల్ వీడియో
ఒక పని ఇలానే చేయాలనేమీ ఉండదు. తమదైన విశ్లేషణాత్మక జ్ఞానం ఉంటే మరో రకంగా కూడా చేయొచ్చని నిరూపించొచ్చు. ఇప్పుడు ఇద్దరు చిన్నారులు అదే చేశారు. సాధారణంగా ఒక సైకిల్ ను ఒక్కరే ఏకకాలంలో తొక్కగలరు. ఎందుకంటే దానికి ఒక్కటే సీటు ఉంటుంది. వెనుక క్యారేజ్ సీటుపై కూర్చున్న వారు వీలైతే పెడల్స్ పై తమ కాళ్లను సపోర్ట్ గా వేసి తొక్కడంలో సాయం చేయొచ్చు.

కానీ, ఈ బాలురు అలా కాదు. రెండు పెడల్స్ ను చెరొకటి పంచుకున్నారు. హ్యాండిల్ ను చెరో వైపున పట్టుకుని, తమవైపునున్న పెడల్ పై నించుని తొక్కుకుంటూ వెళుతున్నారు. కాస్త వెరైటీగా ఉంటుందని ఇలా ట్రై చేశారు. ప్రతిసారీ ప్రతి చోటకు ఇలానే వెళ్లడం అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు. 

వీరు చేసిన పనిని పరిశీలించి చూస్తే కొన్ని సందేశాలు కనిపిస్తాయి. టీమ్ వర్క్ కు ఇది నిదర్శనం. కలసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించొచ్చు. ఇప్పటికే ఈ వీడియోని 59 లక్షల మంది వీక్షించారంటే ఎంత వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ప్రయత్నాలు గతంలోూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
viral vedio
kids cycling
funny way

More Telugu News