బుల్లితెర యాంకర్ సుమ రెమ్యూనరేషన్ ఎంతంటే..!
- దశాబ్దాలు గడుస్తున్నా తగ్గని సుమ క్రేజ్
- మూవీ ఫంక్షన్లకు హోస్టుగా వ్యవహరిస్తున్న టాప్ యాంకర్
- ఒక్కో ఫంక్షన్ కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు
- టీవీ ప్రోగ్రాములకు ఎపిసోడ్ కు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు
టీవీ ప్రోగ్రాములతో పాటు స్టార్ హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఫంక్షన్లు సహా ఇతరత్రా ఈవెంట్లకు సుమ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా రెండు చేతులా సంపాదిస్తున్న సుమ ఒక్కో ప్రోగ్రాముకు ఎంత తీసుకుంటారో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉంటుంది. యాంకర్ సుమ రెమ్యూనరేషన్ విషయంపై ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. మూవీ ఫంక్షన్లకు హోస్ట్ చేయాల్సి వస్తే సుమ ఒక్కో ఈవెంట్‌కు రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు తీసుకుంటారట. టీవీ ప్రోగ్రాములలో పాల్గొన్నందుకు ఒక్కో ఎపిసోడ్ కు రూ.2 నుంచి రూ.3 లక్షల దాకా ఛార్జ్ చేస్తారని సమాచారం. మొత్తంగా చూస్తే యాంకర్ సుమ నెలవారీ సంపాదన రూ.20 లక్షల పైమాటేనని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.