Lavanya Tripathi: 9న వరుణ్ తేజ్, లావణ్యల నిశ్చితార్థం?

 Lavanya Tripathi and Varun Tej to get engaged on June 9 wedding bells soon
  • అధికారికంగా వెలువడాల్సిన ప్రకటన
  • విదేశాల నుంచి నేటి రాత్రి హైదరాబాద్ కు చేరుకోనున్న జంట
  • వీరిద్దరి వివాహంపై కొంత కాలంగా వార్తలు
నాగబాబు కుమారుడు, ప్రముఖ నటుడు వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి మధ్య ప్రేమ నడుస్తోందని కొంత కాలంగా వింటున్నాం. పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించాయి. దీనిపై నాగబాబు ఎప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ ఈ ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఈ నెల 9వ తేదీన జరగనుందని విశ్వసనీయ సమాచారం. కుటుంబ సభ్యులు, కొంత మంది అతిథుల సమక్షంలోనే ఈ కార్యక్రమం ఉంటుందని తెలిసింది. 

పెళ్లి ఎప్పుడనే విషయం ఇంకా తేలలేదు. తాము మంచి స్నేహితులమని వరుణ్ తేజ్, లావణ్య లోగడే స్పష్టం చేశారు. వీరిద్దరూ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. 1వ తేదీ రాత్రి హైదరాబాద్ కు చేరుకుంటారని సమాచారం. అనంతరం వీరి నిశ్చితార్థంపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తాను రోమ్ లో ఉన్నట్టు వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేశాడు. తాను ప్రయాణంలో ఉన్నట్టు లావణ్య కూడా ప్రకటించింది. దీంతో నెటిజన్లు వీరిద్దరూ కలిసే ప్రయాణిస్తున్నట్టు కామెంట్లు చేస్తున్నారు. వీరిద్దరూ కలసి కొన్ని సినిమాల్లో నటించగా, 2017 నుంచి సన్నిహిత బంధం కొనసాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
Lavanya Tripathi
Varun Tej
engagement
wedding soon

More Telugu News