పార్టీలతో సంబంధం లేదు.. ఎవరితోనైనా కలిసి పని చేస్తా: కేశినేని నాని

  • టీడీపీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇచ్చినా అభ్యంతరం లేదని వ్యాఖ్య
  • ఇండిపెండెంట్ గా అయినా పోటీకి సిద్ధమని ప్రకటన
  • మనస్తత్వానికి సరిపోతుందనుకుంటే ఏ పార్టీ అయినా ఓకే అన్న నాని
విజయవాడ ఎంపీ, టీడీపీ నేత కేశినేని నాని బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీపై స్పందించారు. ఎంపీగా టీడీపీ ఏ పిట్టల దొరకు టిక్కెట్ ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని, తాను ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజలు తనను మరోసారి కోరుకుంటే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

తన వ్యాఖ్యలను పార్టీ ఎలా తీసుకున్నా తనకు అభ్యంతరం లేదన్నారు. అభివృద్ధి విషయంలో తనకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరితోనైనా కలిసి పని చేస్తానన్నారు. తన మనస్తత్వానికి సరిపోతుందనుకుంటే ఏ పార్టీ అయినా ఇబ్బంది లేదన్నారు.

Kesineni Nani
Telugudesam

More Telugu News