RTA: తెలంగాణలో ఆర్టీఏ సర్వర్లు డౌన్... నిలిచిన వాహన రిజిస్ట్రేషన్లు

RTA servers down in Telangana
  • ఒక్కసారిగా మొరాయించిన ఆర్టీఏ సర్వర్లు
  • రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యకలాపాలకు అంతరాయం
  • అధికారుల దిద్దుబాటు చర్యలు 
తెలంగాణ రవాణా శాఖ (ఆర్టీఏ)లో సర్వర్లు మొరాయించాయి. నేడు ఉన్నట్టుండి ఆర్టీఏ సర్వర్లు డౌన్ కావడంతో కలకలం రేగింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్టీఏ వెబ్ సైట్ లో పాత, కొత్త వాహనాల వివరాలు కనిపించలేదు. ఈ క్రమంలో, తెలంగాణ వ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న వాహనదారులు రిజిస్ట్రేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. సర్వర్లు డౌన్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. సాంకేతిక నిపుణుల సాయంతో సమస్యను పరిష్కరించేందుకు శ్రమిస్తున్నారు.
RTA
Servers
Telangana

More Telugu News