YS Avinash Reddy: అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు విధించిన 5 షరతులు ఇవే!

  • సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదన్న హైకోర్టు
  • ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశం
  • బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచన
5 conditions for YS Avinash Reddy in anticipatory bail

వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. అవినాశ్ కు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ. 5 లక్షల పూచీకత్తుతో రెండు షూరిటీలను సమర్పించాలని ఆదేశించింది.  సీబీఐకి సమాచారం ఇవ్వకుండా దేశం విడిచి వెళ్లకూడదని షరతు విధించింది.

ఇక సాక్షులను భయపెట్టడం, ఆధారాలను చెరపడం వంటివి చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళ్లొచ్చని సీబీఐకి సూచించింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పాత్రకు సంబంధించి ఒక్క ఆధారాన్ని కూడా సీబీఐ చూపెట్టలేకపోయిందని తీర్పులో హైకోర్టు పేర్కొంది. 

More Telugu News