Polavaram Project: పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం.. భయాందోళనలకు గురవుతున్న అధికారులు, కార్మికులు

  • పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్ద హడలెత్తిస్తున్న పెద్ద పులి
  • పులి సంచరిస్తున్న దృశ్యాలను చిత్రీకరించిన సిబ్బంది
  • పులి సంచరిస్తున్న విషయాన్ని ధ్రువీకరించిన ఫారెస్ట్ అధికారులు
Tiger at Polavaram project

పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్ద పులి హడలెత్తిస్తోంది. పులి సంచారంతో ప్రాజెక్టు అధికారులు, కార్మికులు, స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఏ క్షణంలో ఎటువైపు నుంచి పులి వస్తుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. పులి సంచరిస్తున్న విషయాన్ని అటవీశాఖ అధికారులు కూడా ధ్రువీకరించారు. పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతంలో పులి తిరుగుతున్నట్టు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి వేళల్లో ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరిస్తున్న దృశ్యాలను అక్కడున్న సిబ్బంది తమ ఫోన్లలో చిత్రీకరించారు. 

More Telugu News