Devineni Uma: దేవినేని ఉమపై గెలిచినందుకు నాకు బలుపే.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

Vasantha Venkata Krishna Prasad sensational comments on Devineni Uma
  • నాలుగుసార్లు గెలిచిన ఉమపై 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచానన్న మైలవరం ఎమ్మెల్యే
  • గ్రావెల్, ఇసుకను దోచుకుని ఆయన ఎదిగారని ఆరోపణ
  • ఎన్టీఆర్ జిల్లాలో ఉమ వైసీపీకి అనుకూల శత్రువని వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి గెలిచినందుకే ఇంత బలుపా? అని తనను అంటున్నారని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమపై 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచినందుకు తనకు బలుపేనని అన్నారు. ఉమ గతంలో గ్రావెల్, ఇసుకను అక్రమంగా దోచుకుని ఎదిగారని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆయన వైసీపీకి అనుకూల శత్రువని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ వల్లే  కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి వారు టీడీపీని వీడి వైసీపీలో చేరారని విమర్శించారు. ఉమ ఎక్కడికి వెళ్తే అక్కడ టీడీపీకి 500 ఓట్లు తగ్గుతాయని ఎద్దేవా చేశారు. నందిగామలో కనుక ఉమ ప్రచారం చేస్తే అక్కడ రెండోసారి కూడా జగన్మోహన్‌రావే గెలుస్తారని జోస్యం చెప్పారు.
Devineni Uma
Mylavaram
Vasantha Venkata Krishna Prasad
TDP
YSRCP

More Telugu News