Raghavendra Rao: 'ఆ రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ కాంబినేషన్' అంటూ అరుదైన వీడియో పంచుకున్న దర్శకేంద్రుడు

Raghavendra Rao shares a rare video
  • సహపంక్తి భోజనం చేస్తున్న ఎన్టీఆర్, రామానాయుడు, రాఘవేంద్రరావు
  • కాషాయ దుస్తుల్లో ఉన్న ఎన్టీఆర్
  • ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి వీడియో 

టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఓ ఆసక్తికర, అరుదైన వీడియో పంచుకున్నారు. అందులో ఎన్టీ రామారావు, రామానాయుడు, రాఘవేంద్రరావు ఓ కార్యక్రమంలో భోజనం చేస్తుండడం చూడొచ్చు. దీనిపై రాఘవేంద్రరావు స్పందిస్తూ... ఆ రోజుల్లోనే RRR కాంబినేషన్... అరుదైన వీడియో... రామారావు గారు, రామానాయుడి గారితో మీ రాఘవేంద్రరావు అంటూ చమత్కరించారు. రామారావు, రామానాయుడు, రాఘవేంద్రరావు పేర్లు R తోనే ప్రారంభం అవుతాయి. ఎన్టీఆర్ కాషాయ దుస్తుల్లో ఉండడం చూస్తే, అది ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల నాటి వీడియో అని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News