Manish Sisodia: ఢిల్లీ హైకోర్టులో సిసోడియాకు చుక్కెదురు.. సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిసోడియా
  • బెయిల్ పై విడుదలయితే సాక్షులను ప్రభావితం చేస్తారన్న హైకోర్టు
  • సిసోడియాపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయని వ్యాఖ్య
Delhi High Court denies bail to Manish Sisodia

ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. జస్టిస్ దినేశ్ కుమార్ శర్మ సింగిల్ బెంచ్ సిసోడియా బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సిసోడియా చాలా పలుకుబడి కలిగిన వ్యక్తి అని, బెయిల్ పై ఆయన విడుదలయితే సాక్షులను ప్రభావితం చేయగలరని తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయనపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని చెప్పింది. మరోవైపు బెయిల్ కోసం మనీశ్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

More Telugu News