లారీ డ్రైవర్ కు గుండెపోటు.. ఆగి వున్న కారును ఢీకొట్టిన వైనం
- ప్రొ.జయశంకర్ వర్సిటీ దగ్గర్లో ప్రమాదం
- లారీతో పాటు కారుకి డ్యామేజీ
- కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలు
కర్నూలు నుంచి ధాన్యం లోడును లారీ హైదరాబాద్ కు తీసుకు వస్తోంది. ఈ క్రమంలో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల దగ్గరికి రాగానే డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. లారీపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రోడ్డు పక్కనే ఉన్న ఓ కారును ఢీకొట్టి లారీ ఆగింది. డ్రైవర్ ను కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటు కారణంగా అప్పటికే చనిపోయాడని డ్రైవర్ ను పరీక్షించిన వైద్యులు తెలిపారు.