MS Dhoni: ఎంఎస్ ధోనీ గుర్తుకు వచ్చేలా చేస్తున్నాడు: పాండ్యాకు గవాస్కర్ కితాబు

The Calmness he Brings is Reminiscent of MS Dhoni says Gavaskar credits Hardik Pandya
  • గుజరాత్ విజయాల వెనుక పాండ్యా ఉన్నాడన్న గవాస్కర్ 
  • అంచనాలు లేకుండానే కెప్టెన్సీ చేపట్టాడని వ్యాఖ్య
  • చెన్నై జట్టు తరహా వాతావరణం గుజరాత్ జట్టులో ఉందన్న గవాస్కర్
ఐపీఎల్ లో గుజరాత్ జట్టు విజయాల వెనుక ఆ జట్టు సారథి హార్దిక్ పాండ్యా కృషి ఉందని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. కెప్టెన్సీ విషయంలో పాండ్యాను చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చారు. గత సంవత్సరం మొదటిసారి కెప్టెన్సీ చేపట్టినప్పుడు అతనిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవని, కానీ ఈ ఏడాది కాలంగా అతని ఆట తీరును చూస్తున్నామన్నారు. అతను గుజరాత్ జట్టులో తీసుకు వచ్చిన ప్రశాంతత చూస్తుంటే ధోనీ జ్ఞప్తికి వస్తాడన్నారు. గుజరాత్ జట్టు వంటి వాతావరణాన్ని చెన్నై జట్టులో మాత్రమే మొదటి నుండి చూస్తామని, అలాంటి వాతావరణం తెచ్చిన ఘనత పాండ్యాదే అన్నారు.
MS Dhoni
pandya
Sunil

More Telugu News