Chandrayaan 3: చంద్రయాన్ - 3 ప్రయోగం ఎప్పుడో చెప్పిన ఇస్రో ఛైర్మన్

  • జులైలో చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని చెప్పిన ఛైర్మన్ సోమనాథ్
  • ఈరోజు జీఎస్ఎల్వీ ఎఫ్12 ను ప్రయోగించిన ఇస్రో
  • ఇప్పటికీ పని చేస్తున్న చంద్రయాన్ - 2 ద్వారా పంపిన ఆర్బిటర్
Chandrayan 3 will be in July say ISRO chief

చంద్రుడిపై ప్రయోగాల కోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా చంద్రయాన్ - 3 ప్రయోగం గురించి ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ స్పష్టతను ఇచ్చారు. జులై నెలలో చంద్రయాన్ - 3 ప్రయోగం ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు జీఎస్ఎల్వీ ఎఫ్12 రాకెట్ ను ఇస్రో విజయవంతంగా నింగిలోకి పంపిన సంగతి తెలిసిందే. ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత చంద్రయాన్ గురించి సోమనాథ్ వివరాలను వెల్లడించారు. చంద్రయాన్ - 3 కి ఉపయోగించే ఎల్వీఎం రాకెట్ ను ప్రస్తుతం రూపొందిస్తున్నారు. మరోవైపు చంద్రయాన్ - 2 ద్వారా పంపిన ఆర్బిటర్ ఇప్పటికీ పని చేస్తోంది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ఈ ఆర్బిటర్ హై రెజల్యూషన్ ఇమేజీలను పంపుతోంది.

More Telugu News