Tollywood: ఈ వారంలో థియేటర్లు, ఓటీటీలలో విడుదలవుతున్న చిత్రాలు ఇవే

  • వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పలు చిత్రాలు
  • హవా చాటుతున్న చిన్న చిత్రాలు
  • జూన్ 2న విడుదల అవుతున్న డి సురేశ్ బాబు కొడుకు అభిరామ్ చిత్రం
Telugu films releasing this week

ఈ వేసవిలో పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు హవా చాటుతున్నాయి. ఈ వారంలో కూడా పలు చిత్రాలు థియేటర్లు, ఓటీటీల్లోకి రానున్నాయి. ఈ వారం విడుదల కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే.  

అహింస: ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కొడుకు అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఇది. రజత్ బేడీ, గీతిక, సదా తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతాన్ని అందించారు. జూన్ 2న థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది. 

నేను స్టూడెంట్ సార్: బెల్లంకొండ గణేశ్, అవంతిక కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. జూన్ 2న థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని కీలక పాత్రలను పోషించారు. 

ఐక్యూ: సాయిచరణ్, పల్లవి, ట్రాన్సీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం కూడా జూన్ 2న థియేటర్లలో విడుదల కానుంది. ఇది మానవ మేధస్సుకు సంబంధించిన చిత్రం. సుమన్, బెనర్జీ, సత్య ప్రకాశ్ కీలక పాత్రలను పోషించారు. 

పరేషాన్: తిరువీర్ హీరోగా, పావని కరణం హీరోయిన్ గా నటించి చిత్రం ఇది. ఈ చిత్రాన్ని విశ్వతేజ్, సిద్ధార్థ్ రాళ్లపల్లిలు నిర్మించగా... రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరించారు. సురేశ్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. జూన్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. 

చక్రవ్యూహం: అజయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం కూడా జూన్ 2న థియేటర్లలో విడుదల కాబోతోంది. మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. అజయ్ పోలీసు అధికారిగా నటించాడు. 

విష్వక్: జూన్ 2న ఓటీటీలో విడుదల కానుంది. జీ5లో స్ట్రీమ్ అవుతుంది.

More Telugu News