Anand Mahindra: పార్లమెంట్ కొత్త భవనంలో పాలుపంచుకున్న శిల్పి.. ఆనంద్ మహీంద్రా అభినందనలు

Anand Mahindra shares eminent sculptor majestic work at the new Parliament building
  • నిన్న కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన ప్రధాని 
  • పటేల్, అంబేద్కర్ ఫొటోలను చెక్కిన శిల్పి కుమావత్
  • అద్భుతమైన గుర్తింపు, అద్భుతమైన పని అంటూ ఆనంద్ మహీంద్రా ప్రశంసలు 
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ కొత్త భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఆధునిక వసతులు ఏ విధంగా కల్పించినదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. కొత్త భవనంలో ఎంతో ప్రసిద్ధి చెందిన చిత్రకారులు రూపొందించిన కళాకృతులు కూడా ఉన్నాయి. శిల్పి నరేష్ కుమావత్ కొత్త పార్లమెంట్ భవనానికి తాను అందించిన సేవలను  ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. దీన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేసి అభినందనలు తెలిపారు.

సర్ధార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ పక్కపక్కనే ఉన్న చిత్రాలను శిల్పి నరేష్ స్వయంగా రూపొందించారు. ఈ విషయాన్ని ఆయనే పంచుకున్నారు. ‘‘దేశానికి ముఖ్యమైన రెండు స్తంభాలను పార్లమెంట్ కొత్త భవనంపై నేనే చెక్కాను. నేను ఈ గౌరవాన్ని కలలో కూడా ఊహించలేదు. మహానుభావులకు ఇది అంకితం’’ అంటూ కుమావత్ ట్వీట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా దీన్ని రీట్వీట్ చేస్తూ.. ‘‘అద్భుతమైన పని, అద్భుతమైన గౌరవం! నా నుంచి ఎన్నో అభినందనలు నీకు’’ అని పేర్కొన్నారు. నెటిజన్లు కూడా ఆనంద్ మహీంద్రా పోస్ట్ ను తెగ మెచ్చుకుంటున్నారు. 
Anand Mahindra
sculptor
new Parliament building
kumavat

More Telugu News