G. Kishan Reddy: తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ వార్తలను ఖండించిన కిషన్ రెడ్డి

Kishan Reddy condemns news of change in Telangana BJP leadership
  • తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు అంటూ ప్రచారం
  • ఆ వార్తల్లో నిజంలేదన్న కిషన్ రెడ్డి
  • పార్టీ క్యాడర్ దీనిపై చర్చను ఇంతటితో ఆపాలని హితవు
ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకత్వంలో మార్పు తప్పదని వస్తున్న కథనాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీకి కొత్త నాయకత్వం అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ అంశంపై చర్చలను ఇంతటితో కట్టిపెట్టాలని పార్టీ శ్రేణులకు కిషన్ రెడ్డి సూచించారు. కార్యకర్తలైనా, నేతలైనా క్రమశిక్షణ గీత దాటొద్దని స్పష్టం చేశారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. 

కాగా, తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీ మాత్రమేనని, కాంగ్రెస్ ఒక్క రాష్ట్రంలో గెలిచినంత మాత్రాన తెలంగాణలో కూడా గెలుస్తుందనుకోవడం భ్రమేనని వ్యాఖ్యానించారు. తమ ప్లాన్ ఏంటో వచ్చే ఎన్నికల్లో చూస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ముఖానికి కాలం చెల్లిందని, మోదీ ఫేస్ బీజేపీని తెలంగాణలో గెలిపిస్తుందని అన్నారు.
G. Kishan Reddy
Bandi Sanjay
BJP Chief
Telangana

More Telugu News