Lakshma Reddy: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, బ్రోకర్: లక్ష్మారెడ్డి

Revanth Reddy is a broker says Lakshma Reddy
  • రాజకీయాలను రేవంత్ భ్రష్టు పట్టిస్తున్నారన్న లక్ష్మారెడ్డి
  • తమ జిల్లా విలువను తగ్గిస్తున్నారని మండిపాటు
  • బీజేపీ నేతలు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్, ఒక బ్రోకర్ అంటూ మండిపడ్డారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా బిడ్డనని చెప్పుకుంటూ తమ జిల్లా విలువను తగ్గిస్తున్నారని అన్నారు. 

ఇదే సమయంలో బీజేపీ నేతలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ నేతలు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. బీజేపీ నేతలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎసేనని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని... సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాస్పందనను చూసి ఓర్చుకోలేని మూర్ఖులు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
Lakshma Reddy
BRS
Revanth Reddy
Congress
BJP

More Telugu News