YS Avinash Reddy: హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. బుధవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఆదేశం

TS High Court orders CBI not to arrest YS Avinash Reddy until Wednesday
  • అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ విచారణ
  • అవినాశ్ తల్లి ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు
  • బెయిల్ పై బుధవారం తుది తీర్పును వెలువరిస్తామని వెల్లడి
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో బుధవారం వరకు అవినాశ్ ను అరెస్ట్ చేయవద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ కు సంబంధించి బుధవారం నాడు తుది తీర్పును వెలువరిస్తామని హైకోర్టు తెలిపింది. అవినాశ్ రెడ్డి తల్లి అనారోగ్యం నేపథ్యంలో కోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. 31న తుది ఉత్తర్వులను ఇస్తామని, అప్పటి వరకు అవినాశ్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని తెలిపింది. 

మరోవైపు వాదనల సందర్భంగా... అవినాశ్ రెడ్డిపై ఏ ఆధారాలతో అభియోగాలు మోపుతున్నారని హైకోర్టు ప్రశ్నించగా.. సాక్షుల వాంగ్మూలాల మేరకని సీబీఐ తెలిపింది. సీల్డ్ కవర్ లో సాక్షుల వాంగ్మూలాలను సమర్పిస్తామని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీనికి హైకోర్టు అంగీకరించింది.
YS Avinash Reddy
YSRCP
TS High Court

More Telugu News