CSK: ధోనీ ఓ ఇంద్ర జాలికుడు: మ్యాథ్యూ హేడెన్

  • చెత్త నుంచి నిధిని వెలికి తీయగలడన్న హేడెన్
  • టీమిండియా, సీఎస్కేకు ఎన్నో సేవలు అందించాడని ప్రశంసలు
  • ఆటగాళ్ల నుంచి మంచి ఫలితాలు రాబట్టినట్లు వెల్లడి
Takes Someone Else from Trash Makes Them treasure  Matthew Hayden

సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని ఇంద్రజాలికుడితో (మెజీషియన్) పోల్చాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, కామెంటేటర్ మ్యాథ్యూ హేడెన్. ధోనీ తన సామర్థ్యాలతో సీఎస్కేని పదో సారి ఐపీఎల్ ఫైనల్ కు చేర్చిన తరుణంలో హేడెన్ ధోనీ సామర్థ్యాలపై మాట్లాడాడు. చెత్త నుంచి మాణిక్యాలను వెలుగులోకి తీసుకురాగల సమర్థుడిగా ధోనీని కొనియాడాడు. 

ఐపీఎల్ ఆరంభంలో మంచి బౌలింగ్ దాడి సీఎస్కేకు లేకపోయినా, వారి నుంచి మంచి ఫలితాలు రాబట్టడంలో ధోనీ సక్సెస్ అయినట్టు చెప్పాడు. అజింక్య రహానే, శివమ్ దూబేను బ్యాటింగ్ పరంగా ఉపయోగించుకున్న తీరును కూడా హేడెన్ అభినందించాడు. 

‘‘ధోనీ ఒక మేజీషియన్. చెత్త నుంచి తీసుకుని దాన్ని నిధిగా మార్చగలడు. ఎంతో నైపుణ్యాలున్న సానుకూల కెప్టెన్’’ అని హేడెన్ పేర్కొన్నాడు. భారత జట్టు, సీఎస్కేకు అతడు అందించిన సేవలను ప్రశంసించాడు. వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా, లేడా అన్నది అప్రస్తుతమన్నాడు. ధోనీ వచ్చే ఏడాది ఆడతాడని తాను అనుకోవడం లేదంటూ.. అతడు ఎంఎస్ ధోనీ అనే విషయాన్ని గుర్తు చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్లేయర్ మూడు ఫార్మాట్ల క్రికెట్ కు ఆడే కాలం చెల్లిపోయినట్టు చెప్పాడు.

More Telugu News