Salman Khan: కత్రినా కైఫ్ భర్తను పక్కకు నెట్టేసిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డులు.. వీడియో వైరల్

Salmans bodyguards pushes vicky kaushal away during iifa event in abudhabi
  • అబుదాబీ వేదికగా జరుగుతున్న ఐఐఎఫ్ఏ కార్యక్రమంలో షాకింగ్ ఘటన
  • బాడీగార్డుల తీరుపై నెట్టింట విమర్శలు, సల్మాన్ పైనా నెటిజన్ల గుస్సా
  • ఘటనపై విక్కీ వివరణ
  • వీడియోలో కనిపిస్తున్నట్టుగా అక్కడ పరిస్థితి లేదని వ్యాఖ్య
అబుదాబీ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) అవార్డుల కార్యక్రమంలో తాజాగా ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ అవార్డుల కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, మరో నటుడు విక్కీ కౌశల్ (కత్రినా కైఫ్ భర్త) కూడా హాజరయ్యారు. అయితే, సల్మాన్‌ వస్తున్నాడని తెలిసి ఆయనను పలకరించేందుకు విక్కీ సిద్ధమయ్యాడు. కానీ, సల్మాన్ అక్కడికి వస్తుండగా విక్కీని సల్మాన్ బాడీ గార్డులు పక్కకు నెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూ సినీ అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. 

విక్కీని అవమానించారంటూ అనేక మంది నెటిజన్లు మండిపడ్డారు. ‘‘ఈ బాడీగార్డులకు అస్సలు మర్యాద తెలీదు’’ అని ఫైర్ అయిపోయారు. అయితే, బాడీ గార్డులు తోసిన విషయాన్ని పట్టించుకోకుండా విక్కీ సల్మాన్‌ను పలకరించాడు. ఈ క్రమంలో సల్మాన్ అతడికి సమాధానం చెప్పకుండా ముందుకు వెళ్లిపోవడం కూడా నెటిజన్లకు కోపం తెప్పించింది. ‘‘విక్కీ అంత మర్యాదగా మాట్లాడుతున్నా సల్మాన్ అస్సలు ప్రతి స్పందించకపోవడం ఏమిటి? ఆయనకు ఇంత యాటిట్యూడ్ ఎందుకో’’ అంటూ కొందరు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

కాగా, ఈ వైరల్ వీడియోపై విక్కీ కౌశల్ స్పందించారు. వీడియోలో కనిపిస్తున్నట్టుగా అక్కడి పరిస్థితి లేదని తేల్చి చెప్పారు. ‘‘చాలా సందర్భాల్లో అనవసర చర్చ జరుగుతుంటుంది. వీడియోలో కనిపిస్తున్నట్టుగా అక్కడ పరిస్థితి అస్సలు లేదు. కాబట్టి..దాని గురించి మాట్లాడటం వృథా’’ అంటూ ఈ కాంట్రవర్సీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Salman Khan
Katrina Kaif

More Telugu News