Satyendar Jain: సత్యేంద్ర జైన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

  • జైన్ కు 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • తమ అనుమతి లేకుండా ఢిల్లీ వదిలి వెళ్లకూడదని షరతు
  • మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశం
AAP Satyendar Jain gets bail in Supreme Court

ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు 6 వారాల పాటు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సత్యేందర్ జైన్ బాత్రూమ్ లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. వెంటనే ఆయను ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఐసీయూలో ఆయనకు చికిత్స అందించారు. వారం రోజుల వ్యవధిలో జైల్లో ఆయన కుప్పకూలడం ఇది రెండోసారి. 

జైన్ అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయనకు కొన్ని షరతులు విధించింది. బెయిల్ సమయంలో తమ అనుమతి లేకుండా ఢిల్లీని వదిలి వెళ్లకూడదని ఆదేశించింది. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని షరతు విధించింది.

More Telugu News