నువ్వు చస్తే రెండో పెళ్లి చేసుకుంటా.. భార్యకు నరకం చూపిస్తున్నభర్త
- అదనపు కట్నం కోసం అమెరికాలో మహిళకు వేధింపులు
- గదిలో బంధించి భోజనం పెట్టకుండా నీళ్లు ఇవ్వకుండా వేధింపులు
- తప్పించుకుని స్వదేశం చేరుకున్న బాధితురాలు
- శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు
అయినప్పటికీ ఆమె కట్నం ఊసెత్తకపోవడంతో దాడి చేయడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసేవాడు. ఓ గదిలో బంధించి భోజనం పెట్టకుండా, నీళ్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాడు. చచ్చిపోవాలని, అప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే బోల్డంత కట్నం వస్తుందని చెబుతూ నిత్యం నరకం చూపించేవాడు. భర్త పెట్టే బాధలు భరించలేని బాధితురాలు ఒక రోజు తప్పించుకుని అతి కష్టం మీద స్వదేశం చేరుకుంది. ఆపై శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.