Etela Rajender: పొంగులేటి, జూపల్లితో 4 గంటలకు పైగా చర్చలు జరుపుతున్న ఈటల

Etela Rajender meeting with Ponguleti Srinivas Reddy and Jupalli Krishna Rao
  • హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లో సమావేశం
  • గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే నేతల భేటీ
  • ఇటీవలే ఖమ్మంలో సమావేశమైన ఈటల, పొంగులేటి, జూపల్లి
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మరోసారి సమావేశమయ్యారు. దాదాపు నాలుగు గంటలకు పైగా వీరి సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ శివారులోని ఓ ఫామ్ హౌస్ లో వీరి భేటీ నడుస్తోంది. ఈ సందర్భంగా వీరి గన్ మెన్లు, వ్యక్తిగత సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. ఇటీవలే ఖమ్మంలోని పొంగులేటి నివాసానికి వెళ్లిన బీజేపీ నేతలు పొంగులేటి, జూపల్లితో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరు మరోసారి భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Etela Rajender
BJP
Ponguleti Srinivas Reddy
Jupalli Krishna Rao

More Telugu News