group1: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు!

cm jagan green signal for group1 and group2 notifications
  • గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ పచ్చజెండా
  • 1,000 పోస్టుల దాకా భర్తీ చేసే అవకాశం
  • గ్రూప్‌ 1లో 100కు పైగా పోస్టులు, గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు!
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న లక్షలాది మందికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఆదేశాలతో 1000 పోస్టుల దాకా భర్తీ చేయనున్నారు. 

ఆయా ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం వుంది. ఈ మేరకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రూప్‌ 1లో 100కు పైగా పోస్టులు, గ్రూప్‌ 2లో 900కు పైగా పోస్టులు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
group1
group2
notifications
Jagan
Groups notifications

More Telugu News