BSNL: శుభవార్త చెప్పేసిన బీఎస్ఎన్ఎల్.. 4జీ సేవల ట్రయల్ రన్ ప్రారంభం

  • చండీగఢ్-డెహ్రాడూన్ మధ్య 200 సైట్లలో ట్రయల్ రన్
  • మూడు నెలల అనంతరం రోజుకు 200 నగరాల్లో అందుబాటులోకి 4జీ సేవలు
  • నవంబరు-డిసెంబరు నాటికి 5జీ కూడా
BSNL 4G to Go Live at 200 Sites in Next 2 Weeks

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ప్రైవేటు టెలికం కంపెనీలు 5జీ సేవలు ప్రారంభించి దూసుకెళ్తుండగా, 4జీ సేవల ప్రారంభానికే ఆపసోపాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు 4జీ సేవల ట్రయల్ రన్‌ను ప్రారంభించింది. మొత్తం 200 నగరాల్లో రెండు వారాల్లోపు సేవలు అందుబాటులోకి రానున్నట్టు కేంద్ర ఐటీ, సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. మూడు నెలల ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత రోజుకు సగటున 200 సైట్లలో సేవలు ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. అంతేకాదు, నవంబరు-డిసెంబరు నాటికి 5 సేవలకు అప్‌గ్రేడ్ అవుతామని వివరించారు.

4జీ-5జీ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేశామని, చండీగఢ్-డెహ్రాడూన్ మధ్య 200 సైట్ల ఏర్పాటు పూర్తయిందని, రెండు వారాల్లోపు సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో కలిసి గంగోత్రిలో ఏర్పాటు చేసిన 2 లక్షల సైట్ స్థలాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ వివరాలను వెల్లడించారు.

More Telugu News