sarath babu: అశ్రునయనాల మధ్య ముగిసిన శరత్ బాబు అంత్యక్రియలు

Actor Sarath Babu funerals completed
  • చెన్నైలో ముగిసిన శరత్ బాబు అంత్యక్రియలు
  • గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ శ్మశానవాటికలో అంతిమ కార్యక్రమాలు
  • అంతకు ముందు శరత్ బాబుకు నివాళి అర్పించిన పలువురు సినీ స్టార్లు
సీనియర్ సినీ నటుడు శరత్ బాబు అంత్యక్రియలు బంధువులు, సన్నిహితులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చెన్నైలో కాసేపటి క్రితం అంత్యక్రియలను నిర్వహించారు. అంతకు ముందు చెన్నై టీనగర్ లోని తన నివాసంలో శరత్ బాబు భౌతికకాయాన్ని సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచారు. రజనీకాంత్, సుహాసిని, శరత్ కుమార్, రాధిక తదితర పలువురు ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళి అర్పించారు. అనంతరం నివాసం నుంచి గిండి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని శ్మశానవాటికకు తరలించి, అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు.
sarath babu
funerals
Tollywood

More Telugu News