Faf du Plessis: ప్లే ఆఫ్ లోకి వెళ్లే అర్హత ఆర్సీబీకి లేదు: ఫాప్ డూప్లెసిస్

Last Year Dinesh Karthik Had Faf du Plessis Puts RCB Middle order In Line Of Fire
  • ఓ జట్టుగా ఫలితాల విషయంలో విఫలం చెందినట్టు అంగీకారం
  • అత్యుత్తమ జట్లలో తాము లేమని స్పష్టీకరణ
  • మిడిలార్డర్ లో మంచి హిట్టర్లు లోపించారన్న డూప్లెసిస్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్ కు వెళ్లే అర్హత లేదని స్వయంగా ఆ జట్టు కెప్టెన్ ఫాప్ డూప్లెసిస్ వ్యాఖ్యానించాడు. పోటీలోని అత్యుత్తమ జట్లలో తమది ఒకటి కాదన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో కొందరు ఆర్సీబీ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ.. ఓ జట్టుగా తాము ఫలితాలను రాబట్టడంలో విఫలమైనట్టు డూప్లెసిస్ చెప్పాడు. 

‘‘మేము మా వైపు పరిశీలించి చూస్తే పోటీలోని అత్యుత్తమ జట్లలో మేము లేమని నిజాయతీగా చెప్పొచ్చు’’ అని డూప్లెసిస్ పేర్కొన్నాడు. ముఖ్యంగా తమ జట్టులో మిడిలార్డర్ వైఫల్యం ఉన్నట్టు చెప్పాడు. మిడిలార్డర్ లో పరుగులు చేయలేకపోవడం, మధ్య ఓవర్లలో వికెట్లు తీయలేకపోవడం తమ ఓటమి వైఫల్యాలుగా వివరించాడు. మంచి హిట్టర్లు మిడిలార్డర్ లో లేరని, దీంతో మంచి ఫినిషింగ్ ఇవ్వలేక లీగ్ దశ నుంచే నిష్క్రమించినట్టు తెలిపాడు. 

‘‘బ్యాటింగ్ లో టాప్4 బాగానే ఆడారు. కానీ, సీజన్ అంతటా మిడిలార్డర్ నుంచి పరుగులు లోపించాయి. విరాట్ కోహ్లీ సీజన్ బాగా ఆడాడు. మా ఇద్దరి కాంబినేషన్ లో 40 పరుగుల కంటే తక్కువ ఏ మ్యాచ్ లోనూ రాలేదు. మ్యాచ్ ఫినిషింగ్ లో మాత్రం మేము మరింత మెరుగుపడాలి. గతేడాది దినేష్ కార్తీక్ మ్యాచ్ లకు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. కానీ, ఈ సీజన్ లో అతడి నుంచి అది లోపించింది. ఈ సీజన్ లో సక్సెస్ అయిన జట్లను పరిశీలిస్తే ఐదు, ఆరు, ఏడు స్థానాల్లో మంచి హిట్టర్లు ఉన్నారు’’ అని డూప్లెసిస్ తన వైఫల్యాలను బహిరంగంగా ఎండగట్టాడు. 
Faf du Plessis
RCB
defeat
failure
midilarder
finishing hitters
kohli

More Telugu News