Uttar Pradesh: వరుడికి షాకిచ్చిన వధువు.. దండలు మార్చుకుంటుండగా పెళ్లి రద్దు.. కారణం ఏమిటంటే..!

Bride cancels wedding after groom showsup at wedding drunk
  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • మద్యం తాగి పెళ్లికి వచ్చిన వరుడు, స్నేహితులు
  • దండలు మార్చుకుంటుండగా వరుడి స్నేహితుల అరుపులు
  • దీంతో, వరుడూ తాగివచ్చినట్టు గుర్తించిన వధువు
  • ఈ పెళ్లి వద్దంటూ వేదిక దిగి వెళ్లిపోయిన వైనం 
  • ఇరు కుటుంబాల వారు ఎంత సర్దిచెప్పినా మెట్టుదిగని యువతి, పెళ్లి రద్దు
ఓ వధువు చివరి నిమిషంలో పెళ్లి రద్దు చేసుకుంది. దండలు మార్చుకునే సమయంలో అకస్మాత్తుగా వరుడిని పెళ్లాడేది లేదని తెగేసి చెప్పింది. పెళ్లికొడుకు తాగి వచ్చాడని తెలిసిన వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనానికి దారి తీసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, చౌబేపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి జన్సా స్టేషన్ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఆదివారం రాత్రి ముహూర్తం ఖరారైంది. పెళ్లికొడుకు తన బంధువులు స్నేహితులతో కలిసి ఫంక్షన్ హాల్‌కు ఊరేగింపుగా వచ్చాడు. ఆ తరువాత వేదికపై నిలబడి దండలు మార్చుకునేందుకు రెడీ అయ్యాడు. వధువు కూడా తన స్నేహితులతో వైదికపైకి వచ్చింది. 

ఇంతలో మద్యం మత్తులో వరుడి స్నేహితులు వధువు వెంట వచ్చిన యువతులను చూసి పెద్ద పెట్టున కేకలు వేశారు. దీంతో, వరుడు కూడా మద్యం తాగినట్టు గుర్తించిన యువతి అప్పటికప్పుడు పెళ్లి రద్దు చేసుకుంటున్నట్టు చెప్పి వేదిక దిగి వెళ్లిపోయింది. ఇరు కుటుంబాల వారు వధువుకు సర్దిచెప్పేందుకు విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. చివరకు ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.
Uttar Pradesh

More Telugu News