చేపకళ్ల సొగసరి నభా నటేశ్ .. లేటెస్ట్ పిక్స్!
- గ్లామర్ క్వీన్ అనిపించుకున్న నభా
- 'ఇస్మార్ట్ శంకర్'తో దక్కిన భారీ హిట్
- ప్రమాదం కారణంగా కొంతకాలం పాటు సినిమాలకి దూరం
- ఇప్పుడు రీ ఎంట్రీ కోసం అమ్మడి వెయిటింగ్
నభా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి ఇక్కడ గట్టి పోటీ ఉంది. అయినా అవకాశాలను అందుకుంటూ ఆమె ముందుకు వెళ్లింది. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో ఆమె పెద్ద హిట్ ను అందుకుంది. నటన పరంగా .. గ్లామర్ పరంగా ఆమెకి ఈ సినిమా మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. యూత్ లో కూడా ఆమె అభిమానుల సంఖ్య పెరిగింది.ఆ తరువాత ఆమె తెలుగులో ఏడాదికి రెండు సినిమాల చొప్పున చేస్తూ వచ్చింది. ఆ సినిమాలు అంతంత మాత్రంగానే ఆడాయి. సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలోనే ఆమె ప్రమాదానికి గురికావడం .. కొంతకాలం పాటు ఇంటిపట్టునే ఉండిపోవలసి రావడం వలన ప్రేక్షకులకు దూరమైంది.
ఇక మళ్లీ ఇప్పుడు మరింత ఉత్సాహంతో అడుగు ముందుకు వేసే అవకాశం కోసం వెయిట్ చేస్తోంది. ఈ లోగానే ఫొటో షూట్ లతో అభిమానులకు టచ్ లో ఉంటూ వస్తోంది. అలా ఆమె వదిలిన ఫొటోలు చూస్తుంటే ఈ చేపకళ్ల భామ గ్లామర్ పరంగా మళ్లీ దార్లో పడినట్టుగానే అనిపిస్తోంది. చూడాలి మరి ఆమె కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందేమో.