Virat Kohli: మరోసారి కోహ్లీని టార్గెట్ చేసిన లక్నో బౌలర్ నవీనుల్ హక్ 

Naveen ul Haq savage dig in cryptic post after RCB lose playoffs berth despite Virat Kohli record century
  • కోహ్లీకి ఇష్టమైన వీడియో షేర్ చేసి విమర్శించిన నవీనుల్
  • ప్లే ఆఫ్ లో బెంగళూరు కథ ముగిసిన వెంటనే ఇన్ స్టా లో పోస్ట్
  • కోహ్లీ ముగింపు ఇద్దామనుకున్నా.. తగ్గేది లేదంటున్న లక్నో బౌలర్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీని.. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీనుల్ హక్ మరోసారి టార్గెట్ చేశాడు. ఆదివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ చేతిలో ఆర్సీబీ ఓటమి చవిచూసింది. విరాట్ కోహ్లీ కష్టపడి చేసిన సెంచరీ వృథా అయింది. 19వ ఓవర్లో మొదటి బంతికే శుభ్ మన్ గిల్ సిక్సర్ బాదడంతో గుజరాత్ విజయం ఖరారైంది. ఆ వెంటనే డగౌట్ లో కూర్చున్న విరాట్ కోహ్లీ బాధతో వాటర్ బాటిల్ ను కిందకు విసిరి కొట్టాడు. 

అదే సమయంలో నవీనుల్ హక్ తన ఇన్ స్టా గ్రామ్ లో ఓ విమర్శనాత్మక పోస్ట్ వదిలాడు. ప్రముఖ ఆఫ్రికా రిపోర్టర్ కథను షేర్ చేశాడు. ‘‘దేవుడు మా పట్ల దయ చూపాలంటూ’’ నవ్వుతున్న వీడియోను పోస్ట్ చేశాడు. మరి ఇది కోహ్లీని ఉద్దేశించిందే ఎందుకు అయ్యి ఉంటుందనే సందేహం రావచ్చు. ఈ వీడియోకి, కోహ్లీకి ఓ చిన్న అనుబంధం ఉంది. ఈ ఏడాది మార్చిలో దిగ్గజ క్రికెటర్ డీవిలియర్స్ తన యూట్యూబ్ చానల్ లో కోహ్లీతో లైవ్ చాట్ నిర్వహించాడు. ఇప్పుడు నవీనుల్ హక్ షేర్ చేసిన వీడియోపై నాటి లైవ్ చాట్ లో కోహ్లీ, డీవిలియర్స్ పగలబడి నవ్వారు. ఇది తనకు ఎంతో ఇష్టమైన వీడియో అని కోహ్లీ ఆ సందర్భంలో చెప్పాడు. అందుకే అదే వీడియోతో నవీనుల్ హక్ కోహ్లీని లక్ష్యం చేసుకుని విమర్శించినట్టయింది. 

మే 1న లక్నోలోని ఎక్నా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో కోహ్లీకి, నవీనుల్ కు మధ్య గొడవ జరగడం, ఆ తర్వాత అది కోహ్లీ, లక్నో జట్టు మెంటార్ గంభీర్ మధ్య వాగ్వివాదానికి దారి తీయడం గుర్తుండే ఉంటుంది. నవీనుల్ కు తన కాలి షూ చూపించి కోహ్లీ ఆగ్రహంగా మాట్లాడడం నాడు కనిపించింది. దీన్ని నవీనుల్ చాలా గట్టిగానే తిప్పికొట్టాడు. అప్పటి నుంచి నవీనుల్ వీలు చిక్కినప్పుడల్లా కోహ్లీని సామాజిక మాధ్యమంలో టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. పగ, కోపాలకు తనకు సమయం లేదని కోహ్లీ దీనికి ముగింపు ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయినా నవీనుల్ నాటి ఘటనను మార్చిపోవడం లేదు.
Virat Kohli
RCB
lose playoffs berth
Naveen ul Haq
cryptic post
Instagram

More Telugu News