Ptrabhas: 400 మందితో 'సలార్' క్లైమాక్స్!

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్'
  • దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ నీల్
  • హైలైట్ గా నిలిచే యాక్షన్ సీన్స్ 
  • సెప్టెంబర్ 28వ తేదీన సినిమా రిలీజ్ 
Salaar Movie Update

ప్రభాస్ ను మరోసారి మాస్ యాక్షన్ హీరోగా చూడాలనుకుంటున్న అభిమానులంతా, 'సలార్' కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఆ మధ్య ఈ సినిమా షూటింగుకు కొంత గ్యాప్ ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ లో దాదాపు 400 మంది పాల్గొంటారని అంటున్నారు. అంటే క్లైమాక్స్ ను ఏ రేంజ్ లో చూపించనున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించు 'కేజీఎఫ్' స్థాయిలో క్లైమాక్స్ ఉంటుందని అనుకోవచ్చు. ఈ ఎపిసోడ్ ఈ సినిమాకై హైలైట్ గా నిలుస్తుందనీ, భారీతనానికి అద్దం పడుతుందని అంటున్నారు. 

ఇంతవరకూ ప్రభాస్ చేసిన యాక్షన్ సీన్స్ లో ఇది మొదటివరుసలో కనిపిస్తుంది. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఆకాశమే హద్దుగా దూసుకుపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. 

More Telugu News