Ram Gopal Varma: కేరళ స్టోరీపై రామ్ గోపాల్ వర్మ మరోసారి వ్యాఖ్యలు

Ram Gopal Varma supports The Kerala Story says film is a mirror to dead face of Bollywood
  • వరుస ట్వీట్లతో తన అభిప్రాయాలను పంచుకున్న దర్శకుడు
  • నిజాన్ని అనుసరించడం కంటే అబద్ధాన్ని ఆచరించడం తేలికన్న వర్మ
  • బాలీవుడ్ లో ప్రతి స్టోరీ చర్చపై దీని ప్రభావం ఉంటుందన్న అభిప్రాయం
వివాదాస్పద, సంచలనాత్మక సినిమా కేరళ స్టోరీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ‘‘ఈ వివాదాస్పద సినిమా ప్రధాన స్రవంతిలోని బాలీవుడ్ మృత ముఖానికి దెయ్యం మాదిరి అద్దం పడుతోంది’’ అని వర్మ వ్యాఖ్యానించారు. కేరళ స్టోరీస్ కు మద్దతుగా లోగడే వర్మ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తాజాగా మరోసారి తన వ్యాఖ్యల్లోనూ ఈ సినిమాకు మద్దతు పలికారు.

‘‘ఎవరైనా మనకంటే ముందుకు చొచ్చుకుపోయి, మనం షాక్ అయ్యే నిజాలు చెబితే, అప్పుడు ఇతరులతో, మనతో మనం అబద్ధాలు చెప్పుకోవడంలో ఎంతో సౌకర్యంగా ఉంటాం. కేరళ స్టోరీ దిగ్భ్రాంతికరమైన విజయం పట్ల బాలీవుడ్ మౌనంగా ఉండడం ఇదే తెలియజేస్తోంది. బాలీవుడ్ లో ప్రతి స్టోరీ చర్చా గదిలో, కార్పొరేట్ హౌస్ లలో ద కేరళ స్టోరీ ఎప్పటికీ ఓ మిస్టీరియస్ పొగమంచులా వెంటాడుతూనే ఉంటుంది. కేరళ స్టోరీ నుంచి నేర్చుకోవడం కష్టం. ఎందుకంటే నిజాన్ని అనుసరించడం కంటే అబద్ధాన్ని ఆచరించడం సులభం’’ అని వర్మ వరుస ట్వీట్లలో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
Ram Gopal Varma
tweets
The Kerala Story
boolywood
ghost

More Telugu News