Thota Chandrasekhar: తెలంగాణ తరహా అభివృద్ధి ఏపీలో మచ్చుకైనా కనిపించడంలేదు: తోట చంద్రశేఖర్

  • కేటీఆర్ కృషితో హైదరాబాద్ స్టార్టప్ హబ్ గా నిలుస్తోందన్న తోట
  • కేటీఆర్ ఓ బ్రాండ్ అంబాసిడర్ లా శ్రమిస్తున్నారని కితాబు
  • హైదరాబాదుకు రోజుకొక కంపెనీ తీసుకువస్తున్నారని వెల్లడి
  • ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రావడంలేదని విమర్శలు
Thota Chandrasekhar comments on AP

బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రముఖ స్టార్టప్ హబ్ గా నిలుస్తోందని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఐటీ కంపెనీలకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారిందని అన్నారు. ఇదంతా మంత్రి కేటీఆర్ చలవేనని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ లా శ్రమిస్తున్న కేటీఆర్ రోజుకొక పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడమే ధ్యేయంగా పెట్టుకున్నారని కొనియాడారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న కేటీఆర్ రోజుకొక కొత్త కంపెనీని హైదరాబాద్ తీసుకువస్తున్నారని వివరించారు. 

కానీ, ఏపీలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, తెలంగాణ తరహా అభివృద్ధి ఇక్కడ మచ్చుకైనా కనిపించడం లేదని తోట చంద్రశేఖర్ విమర్శించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదని తెలిపారు. ఒక్క పెద్ద ఐటీ కంపెనీ వచ్చిన దాఖలాలు లేవని, వచ్చిన పెట్టుబడులు కూడా వెనక్కిపోతున్నాయని తోట చంద్రశేఖర్ విమర్శించారు. 

వీళ్లకు ఆర్భాటం ఎక్కువ, చేసేది తక్కువ అని ఎద్దేవా చేశారు. రూ.13 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నామని చెబుతున్నారని, అందులో రాష్ట్రానికి వచ్చింది పూజ్యం అని, ఉద్యోగాల కల్పన శూన్యం అని పేర్కొన్నారు.

More Telugu News