SBI: రూ.2 వేల నోట్లపై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన ఎస్ బీఐ!

  • రూ.2 వేల నోట్ల మార్పిడికి రిక్వెస్ట్ ఫామ్ నింపాలని, గుర్తింపు పత్రం చూపాలని పుకార్లు
  • రసీదులు, రిక్వెస్టులు ఏమీ అవసరం లేదన్న స్టేట్ బ్యాంక్
  • నేరుగా వెళ్లి ఒక విడతలో రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని సూచన 
no need to submit id proof in banks for 2000 note exchange

రూ.2 వేల నోట్ల మార్పిడిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) కీలక ప్రకటన చేసింది. నోట్ల మార్పిడికి ప్రజలు ఎలాంటి గుర్తింపు పత్రం లేదా రసీదు చూపించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. రిక్వెస్ట్ ఫామ్ నింపాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. 

రూ.2 వేల నోట్లను చెలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నామని ఆర్ బీఐ రెండు రోజుల కిందట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు దాకా వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చని, లేదా మార్పిడి చేసుకోవచ్చని చెప్పింది. అన్ని బ్యాంకులు, ఆర్ బీఐ రీజినల్ ఆఫీసుల్లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని సూచించింది.

అయితే రూ.2 వేల నోట్ల మార్పిడికి ఓ ఫామ్ తోపాటు ఆధార్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించాలంటూ సోషల్ మీడియాలో రూమర్లు వస్తున్న నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీ ఇచ్చింది. ఒక విడతలో గరిష్టంగా రూ.20 వేల విలువైన రూ.2 వేల నోట్లను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు దేశంలోని అన్ని శాఖలకు పూర్తి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించింది.

More Telugu News