jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థ బీడీఎల్ లో ఉద్యోగాలు

BDL Recruitment BDL invites applications for engineer posts for Hyderabad and some other BDL Units
  • 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  • బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ అభ్యర్థులకు అవకాశం
  • ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. హైదబాబాద్ తో పాటు విశాఖపట్నం, బెంగళూరు, భానూర్, కొచ్చి, ముంబై కార్యాలయాల్లో ఉన్న 100 పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. హెచ్ఆర్, బిజినెస్ డెవలప్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్ విభాగాల్లో ఉన్న ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనుంది.

వివిధ నగరాల్లోని బీడీఎల్ కార్యాలయాల్లో ప్రాజెక్ట్ ఇంజనీర్/ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం తప్పనిసరి. 

దరఖాస్తుదారుల వయసు మే10 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అకడమిక్ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.39,000 వరకు జీతం చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..
ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ మే 24 నుంచి ప్రారంభమై జూన్ 23తో ముగుస్తుంది. జులై రెండో వారంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం లింక్..
jobs
notification
central govt jobs
BDL
Recruitment
engineers
Hyderabad

More Telugu News