NTR: హైదరాబాద్‌లో ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. ఫొటోలు ఇవిగో!

NTR Centenay Celebrations Held in Hyderabad Photos here
  • కూకట్‌పల్లిలోని ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు
  • హాజరైన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు
  • ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు
ఘనంగా జరిగాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కార్యక్రమానికి హాజరై ఉద్వేగపూరిత ప్రసంగాలు చేశారు. ఎన్టీఆర్‌తో  తమకున్న అనుభవాలను నెమరువేసుకున్నారు. సినిమా, వైద్య రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఘనంగా సత్కరించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలందరూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. వేడుకలకు హాజరైన వారితో ఖైతలాపూర్ జనసంద్రాన్ని తలపించింది. అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల ఫొటో మాలిక మీ కోసం..

 
 
NTR
Hyderabad
Chandrababu
Centenay Celebrations

More Telugu News