NTR: హైదరాబాదులో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం ప్రారంభం

NTR centenary celebrations has begun
  • కూకట్ పల్లిలోని కైతలాపూర్ మైదానంలో సభ
  • హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు
  • హాజరైన సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకల కార్యక్రమం కూకట్ పల్లిలోని కైతలాపూర్ మైదానంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా భువనేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా బ్రాహ్మణి, వసుంధర, వామపక్ష నేత సీతారాం ఏచూరి, మురళీమోహన్, జయప్రద, జయసుధ, ప్రభ, అల్లు అరవింద్, అశ్వినీదత్, విజయేంద్రప్రసాద్, వెంకటేశ్, తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్, కర్ణాటక అగ్రహీరో శివరాజ్ కుమార్, రామ్ చరణ్, నాగచైతన్య, శ్రీలీల, సుమంత్, అడివి శేష్, సిద్దు జొన్నలగడ్డ  ఈ వేడుకల ప్రారంభం వేళ వేదికపై ఉన్న ఎన్టీఆర్ ప్రతిమకు ప్రముఖులు నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 'శక పురుషుడు' పుస్తకాన్ని ఆవిష్కరించారు.
NTR
Centenary Celebrations
Hyderabad
TDP

More Telugu News