Lioness: ఒక ఆడ సింహం బలం ఎంతో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది!

This video showcases the strength of a lioness
  • సింహం ఒకవైపు... ముగ్గురు బాడీ బిల్డర్లు మరోవైపు...!
  • తాడును లాగే పోటీ
  • సింహాన్ని అంగుళం కూడా కదల్చలేకపోయిన బాడీబిల్డర్లు
  • వీడియో వైరల్
సింహాన్ని మృగరాజు అని ఊరికే అనలేదు. అడవిలో దాదాపుగా సింహాలదే ఆధిపత్యం ఉంటుంది. భారీ శరీరంతో, తీక్షణమైన చూపులతో సింహాలు వణుకు పుట్టిస్తాయి. ఇక, అసలు విషయానికొస్తే... బలం విషయంలో ఆడ సింహాలు మగ సింహాలకు ఏమాత్రం తీసిపోవు. ఆడ సింహాలు దాదాపు 250 కిలోల బరువు ఉంటాయి. వీటి శక్తి అమోఘం. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.

ఓ గట్టి తాడు కొసను ఆడ సింహం నోటితో పట్టుకోగా... ఆ తాడు మరో కొసను ముగ్గురు బాడీ బిల్డర్లు పట్టుకున్నారు. వాళ్లు ఎంత కష్టపడినా ఆ ఆడ సింహాన్ని అంగుళం కూడా కదల్చలేకపోయారు. ఆ ముగ్గురు బలాఢ్యులు ఆపసోపాలు పడ్డారు కానీ, అవతలివైపు ఉన్న సింహం మాత్రం "ఓస్ ఇంతేనా" అన్నట్టుగా తన శక్తిని ఘనంగా ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Lioness
Strength
Rope
Video

More Telugu News