Tamannaah: బాలకృష్ణ, అనిల్ రావిపూడిలను ఎంతో గౌరవిస్తా... కానీ ఇలాంటి వార్తలు చాలా బాధిస్తున్నాయి: తమన్నా

Tamannaah condemns news that she will do a item song in Balakrishna and Anil Ravipudi movie
  • బాలకృష్ణ 108వ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం
  • శరవేగంగా బాలయ్య సినిమా షూటింగ్
  • ఈ చిత్రంలో తమన్నా ఐటం సాంగ్ చేస్తోందంటూ కథనాలు
  • ఖండించిన తమన్నా.. తప్పుడు వార్తలు అంటూ ఆగ్రహం
యువ హీరోలకు దీటుగా హిట్లు కొడుతూ దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ తన 108వ చిత్రాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమాలో ఓ అదిరిపోయే ఐటం సాంగ్ ఉందని, ఆ పాటకోసం దర్శకుడు అనిల్ మిల్కీబ్యూటీ తమన్నాను ఒప్పించాడని కథనాలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలపై తమన్నా మండిపడింది. 

అనిల్ రావిపూడి సర్ తో కలిసి పనిచేయడాన్ని తాను ఎల్లప్పుడూ ఎంజాయ్ చేస్తానని, ఆయనంటే ఎంతో గౌరవం ఉందని తెలిపింది. అదే సమయంలో నందమూరి బాలకృష్ణ సర్ ను కూడా చాలా గౌరవిస్తానని పేర్కొంది. 

కానీ తన గురించి, వారి సినిమాలో తాను ఒక పాటలో నటిస్తున్నానంటూ నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి వార్తలు చదువుతుంటే చాలా బాధ కలుగుతోందని తమన్నా వాపోయింది. ఇలాంటి తప్పుడు కథనాలు రాసేముందు నిజానిజాలు నిర్ధారణ చేసుకోవాలని హితవు పలికింది.
Tamannaah
Balakrishna
Anil Ravipudi
Item Song
NBK108
Tollywood

More Telugu News