Karnataka: సిద్ధరామయ్య అనే నేను.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం!

Siddaramaiah takes oath as the Chief Minister of Karnataka
  • కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం 
  • డిప్యూటీ సీఎంగా డీకే బాధ్యతలు
  • హాజరైన  రాహుల్, స్టాలిన్, నితీష్, కమలహాసన్
కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో భారీ జన సందోహం మధ్య ఆ రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ కూడా ప్రమాణం చేశారు. ఈ ఇద్దరితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. 

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హాజరయ్యారు. కానీ, సోనియా గాంధీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరుకాలేదు. ఇతర పార్టీల నేతలు, సినీ నటుడు కమలహాసన్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై రాహుల్ గాంధీ.. సిద్ధరామయ్య, శివకుమార్‌‌ లతో చేయెత్తి పార్టీ ఐకమత్యాన్ని చాటే ప్రయత్నం చేశారు.
Karnataka
Chief Minister
Siddaramaiah
Rahul Gandhi
DK Shivakumar

More Telugu News