Bonda Uma: దేశంలో అందరూ సీబీఐకి భయపడుతుంటే.. ఏపీలో మాత్రం సీబీఐని వైసీపీ భయపెడుతోంది: బొండా ఉమ

  • వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి దొరికిపోయినా సీబీఐ అరెస్ట్ చేయలేకపోతోందన్న బొండా ఉమ
  • విచారణకు పిలిచినప్పుడల్లా ఏదో ఒక వంకతో అవినాశ్ తప్పించుకుంటున్నారని ఆరోపణ 
  • ఈ రోజు అమ్మకు బాగోలేదన్నారని, రేపు కుక్క పిల్ల తప్పిపోయిందని చెబుతారేమోనని ఎద్దేవా
tdp leader bonda uma fires on ycp mp avinash reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి హాజరుకాకపోవడంపై టీడీపీ నేత బొండా ఉమ మండిపడ్డారు. సీబీఐకి దేశంలో అందరూ భయపడుతుంటే.. ఏపీలో మాత్రం సీబీఐని వైసీపీ భయపెడుతోందని విమర్శించారు. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పక్కాగా దొరికిపోయినా.. ఇప్పటిదాకా సీబీఐ అరెస్ట్ చేయలేకపోయిందన్నారు.

సీబీఐ విచారణకు పిలిచిన ప్రతిసారి ఏదో ఒక వంకతో అవినాశ్ రెడ్డి తప్పించుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ఈ రోజు అమ్మకు ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. రేపు మా ఇంట్లో కుక్క పిల్ల తప్పిపోయిందని చెబుతారేమో’’ అని ఎద్దేవా చేశారు.

ముందస్తు బెయిల్ కోసం అవినాశ్‌ రెడ్డి వందల కోట్లు ఖర్చు పెట్టాడని.. ఆ డబ్బులు ఎక్కడివని, ఎవరిచ్చారని ప్రశ్నించారు. ‘‘వివేకా కేసులో అవినాశ్ రెడ్డి చిన్న చేప మాత్రమే. అసలు తిమింగలాలు ఇంకా ఉన్నాయి. చిన్న చేపే సీబీఐని ఈ విధంగా చేస్తే.. తిమింగలాలు ఇంకేమి చేస్తాయో?’’ అని బొండా ఉమ అన్నారు.

More Telugu News