Janasena: ఫ్రీ సింబల్ జాబితాలోకి జనసేన ‘గాజు గ్లాసు’.. జనసేనకు ఈసీ షాక్

  • ఎన్నికల నిబంధన ప్రకారం జనసేన పార్టీ గుర్తును లాగేసుకున్న ఈసీ
  • అతి తక్కువ ఎన్నికల్లో పోటీ చేయడం, నిర్ణీత శాతం ఓట్లను సాధించడంలో విఫలం
  • గతంలో బద్వేలు, తిరుపతి లోక్‌సభ ఎన్నికల్లోనూ జనసేన సింబల్‌ ఇతరులకు కేటాయింపు
Janasena Glass Free  A Setback To Pawan

జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ గ్లాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేరుస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా జనసేన ఆ గుర్తును దాదాపు కోల్పోయినట్టే. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతోపాటు మొత్తం పోలైన ఓట్లలో 6 శాతం సాధించాల్సి ఉంటుంది. దీంతోపాటు కనీసం రెండు సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది. 

2019 ఎన్నికల్లో ఆ పార్టీ 6 శాతం ఓట్లు సాధించినప్పటికీ సీట్లు సాధించడంలో విఫలమైంది. ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చినట్టు ఈసీ స్పష్టం చేసింది. గతంలో బద్వేలు, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించింది. ఇప్పుడు తెలంగాణలో గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.

More Telugu News