Bandi Sanjay: బీసీల్లో ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చి అణగదొక్కుతున్నారు: బండి సంజయ్

Bandi Sanjay lashes out at KCR for not giving BC bandhu
  • తెలంగాణలో 50 శాతం బీసీలు ఉన్నారన్న బండి సంజయ్
  • ఎన్నికలు వస్తే తప్ప కేసీఆర్ కు ఆత్మగౌరవ భవనాలు గుర్తుకు రావని వ్యాఖ్య
  • బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వడం తప్ప ఏం చేశారని ప్రశ్న

తెలంగాణలో 50 శాతం మంది బీసీలు ఉంటే మంత్రివర్గంలో ముగ్గురికే మంత్రి పదవులు ఇచ్చి రాజకీయంగా అణగదొక్కారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికలు వస్తే తప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆత్మగౌరవ భవనాలు గుర్తుకు రావని ఎద్దేవా చేశారు. రూ.1600 కోట్లతో సచివాలయం నిర్మించారని, కానీ ఇప్పటి వరకు బీసీ ఆత్మగౌరవ భవనాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరిగిందన్నారు.

రాష్ట్రంలో బీసీలకు గొర్రెలు, బర్రెలు ఇవ్వడం తప్ప కేసీఆర్ ఏం చేశారని నిలదీశారు. బడ్జెట్ లో బీసీలకు కేవలం రూ.5వేల కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. బీసీ సబ్ ప్లాన్, అభివృద్ధికి మాత్రం కేసీఆర్ ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టడం లేదన్నారు. బీసీ బంధును వెంటనే ప్రవేశపెట్టాలని, ఎందుకు ఈ పథకాన్ని తీసుకు రావడం లేదో చెప్పాలన్నారు.

  • Loading...

More Telugu News