Bengaluru: బెంగళూరులో ట్రాఫిక్‌లో చిక్కుకున్న మహిళా ఉద్యోగి ఏం చేసిందో చూడండి!

Pic of bengaluru woman working while struck in traffic goes viral
  • నెట్టింట మహిళా ఉద్యోగి ఫొటో వైరల్
  • ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి బైక్‌పైనే ఆఫీసు పనిలో పడ్డ మహిళ
  • బెంగళూరు బిజీ లైఫ్ ఇంతే అంటూ నెటిజన్ల కామెంట్
భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరులో లైఫ్ క్షణం తీరిక లేకుండా గడిచిపోతుంటుంది. అక్కడి ఉద్యోగుల బిజీ జీవితాలకు సంబంధించి ఎన్నో ఘటనలు పలుమార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆఫీసుకు వెళుతూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళ ఫొటో ఇది. ఆమె ర్యాపిడో బైక్‌పై ఆఫీసుకు బయలుదేరింది. అయితే, మధ్యలో ట్రాఫిక్ ఆగిపోవడంతో ఆమె బైక్‌పైనే తన ల్యాప్‌టాప్‌ తీసి పనిలోకి దిగిపోయింది. 

ఆ మహిళ పక్కనే కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి ఈ దృశ్యాన్ని ఫొటో తీసి నెట్టింట షేర్ చేయడంతో ఈ ఉదంతం వైరల్‌గా మారింది. ఇప్పటివరకూ ఈ ఫొటోకు 40 వేలకు పైగా వ్యూస్ రాగా నెటిజన్లు వందల సంఖ్యలో కామెంట్స్ చేశారు. బెంగళూరులో ఉద్యోగులు తమ శక్తియుక్తులు, సమయాన్ని జాబ్ కోసం ధారపోస్తారని కొందరు కామెంట్ చేశారు. ఉద్యోగులకు ఆఫీసు లేదా ఇంటి నుంచి కూడా పనిచేసే వెసులుబాటును కంపెనీలు ఎప్పుడూ కల్పించాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. బిజీ బెంగళూరులో లైఫ్ ఇంతేనని మరి కొందరు నిట్టూర్చారు.
Bengaluru

More Telugu News