sp hinduja: హిందుజా గ్రూప్ చైర్మన్ ఎస్పీ హిందుజా కన్నుమూత

chairman of Hinduja Group SP Hinduja  passes away at 87
  • 87 ఏళ్ల వయస్సులో లండన్ లో మృతి
  • కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎస్పీ హిందుజా
  • మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కుటుంబం
హిందుజా గ్రూప్ చైర్మన్, హిందుజా సోదరుల్లో ఒకరైన శ్రీచంద్ పరమానంద్ హిందుజా (ఎస్పీ హిందుజా) కన్నుమూశారు. 87 ఏళ్ల వయస్సులో ఆయన లండన్ లో కన్నుమూశారు. నలుగురు హిందుజా సోదరుల్లో పెద్దవాడైన ఎస్పీ హిందుజా కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

'ఈరోజు మా కుటుంబ పితామహుడు, హిందుజా గ్రూప్ చైర్మన్ శ్రీ ఎస్పీ హిందుజా కన్నుమూసినందుకు గోపిచంద్, ప్రకాశ్, అశోక్ మరియు ఇతర హిందుజా కుటుంబం మొత్తం విచారం వ్యక్తం చేస్తోంది' అని ఆ కుటుంబం ఓ ప్రకటనను విడుదల చేసింది.  ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది ఆ కుటుంబం.

ఎస్పీ హిందుజా 1935 నవంబర్ 28న బ్రిటిష్ ఇండియాలోని సింధ్ ప్రావిన్స్ లోని కరాచీలో జన్మించారు. ఈయనకు ఇద్దరు కూతుళ్లు. ఈ ఏడాది జనవరిలో ఎస్పీ హిందుజా అర్ధాంగి కన్నుమూశారు.
sp hinduja

More Telugu News