KCR: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి?: బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్య

KCR talks about AP development
  • తెలంగాణ మోడల్ శరణ్యమని ఓ ఐపీఎస్ చెప్పారని వ్యాఖ్య
  • గుజరాత్ మోడల్ ఓ బోగస్ అన్న కేసీఆర్
  • నేను చెప్పినట్లు చేస్తే 50వేల మెజార్టీతో గెలుస్తారన్న సీఎం
తెలంగాణ ఓ వజ్రపు తునక అని, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏమిటి? అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అన్నారు. బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ మోడల్ శరణ్యమని ఔరంగాబాద్ లో ఓ ఐపీఎస్ అధికారి స్వయంగా చెప్పారన్నారు. మనం చేసిన పనులను మనమే చెప్పుకోవడం లేదన్నారు. గుజరాత్ మోడల్ ఓ బోగస్ అని, దేశం తెలంగాణ మోడల్ కోరుకుంటోందన్నారు.

బీఆర్ఎస్ కు బాస్, భగవద్గీత, వేదాలు అన్నీ తెలంగాణ ప్రజలే అన్నారు. కులం, మతంపై ఏ పార్టీ గెలవదన్నారు. తాము అన్ని వర్గాలను సమదృష్టితో చూస్తున్నట్లు చెప్పారు. సిట్టింగ్ లకే ఎక్కువ మందికి టిక్కెట్ ఇస్తామని, తాను చెప్పినట్లు చేస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ 50వేల మెజార్టీతో గెలుస్తారన్నారు. సింగరేణిని మొత్తం మనమే తీసుకుంటామంటే మోదీ అంగీకరించడం లేదన్నారు.
KCR
Andhra Pradesh

More Telugu News