హైదరాబాద్ లో తొలి లిక్కర్ ఎలర్జీ కేసు
- ఆగ్రాకు చెందిన వ్యక్తిలో గుర్తింపు
- మద్యం తాగిన తర్వాత ముఖంపై దురదలు, వేడి
- ఛాతీలో పట్టేసినట్టు భావన
- ప్రపంచంలో ఈ తరహా కేసులు చాలా అరుదు
అసలు విషయం ఏమిటంటే జాన్ కొన్ని నెలల క్రితం ఓ విందు పార్టీకి హాజరై మద్యం సేవించాడు. తర్వాత ముఖంపై వేడిగా ఉండడంతో అద్దంలో చూసుకోగా, ఎర్రబడినట్టు కనిపించింది. చర్మంపై దురదలు, ఛాతీ పట్టేసినట్టు అనిపించడంతో ఆసుపత్రిలో చేరి, చికిత్సతో నయం చేసుకున్నాడు. కొంత కాలానికి మరోసారి మద్యం సేవించినప్పుడు కూడా అతడికి తిరిగి అదే అనుభవం ఎదురైంది. మళ్లీ మళ్లీ వస్తుండడంతో ఎవరి సూచనో మేరకు హైదరాబాద్ లోని అశ్విని అలెర్జీ సెంటర్ ను సంప్రదించాడు. అక్కడి వైద్యులు ఆల్కహాల్ అలెర్జీగా నిర్ధారించారు. మద్యపాన సమయంలో మసాలా పల్లీలు, బఠానీలు, మటన్, చికెన్ తినడం వల్ల ఇది వస్తుందని తెలిపారు. మద్యం సేవించిన తర్వాత ఈ తరహా అలెర్జీలు కనిపిస్తే తాగకుండా ఉండడమే మంచిదని సూచిస్తున్నారు.